SWAROOP MARTIN BEST SINGING

Lyrics Details

 

Singer: swaroop martin
Lyrics Writer: swaroop martin
Music Director: swaroop martin
Actors: swaroop martin Credits: swaroop martin

Lyrics:

సమయమిదే నీకు తరుణమిదే సమయం ఇదే నీకు తరుణమిదే జీవితమంతా వ్యర్థంగా బ్రతికి తనువు చాలించాక నువ్వు తీసుకువెళ్లేదేది ప్రాణమున్నప్పుడే ప్రభు యేసునీ నమ్మి నీవు రక్షణ పొందాలి

(కోరస్)
తెలుసుకో సత్యం మార్చుకొని జీవితం సమయం ఇంకా లేదు బ్రతుకంతా వ్యర్థం (2)

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)

సమయమిదే నీకు తరుణమిదే సమయం ఇదే నీకు తరుణమిదే.. (2)
ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగుచేతును

1) అందం అలంకరణ మోసం మోసం సౌందర్యం నీకు ఉన్న వ్యర్థం వ్యర్థం సత్యాన్ని నువ్వు తెలుసుకో పాపాలన్నీ ఒప్పుకో
ఏసే మార్గం సత్యం జీవం నిత్యజీవము నీకు ఇచ్చును పాత బ్రతుకునూ విడిచిపెట్టుము నూతన సృష్టిగా మారుమూ
సోదరా ఓ సోదరీ

కోరస్)
తెలుసుకో సత్యం మార్చుకొని జీవితం సమయం ఇంకా లేదు బ్రతుకంతా వ్యర్థం (2)

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)

సమయమిదే నీకు తరుణమిదే సమయం ఇదే నీకు తరుణమిదే..

2) సృష్టికర్త ఎవరో నువ్వు తెలుసుకోవాలి సృష్టిని పూజించుట నువ్వు మానుకోవాలీ మూయబడిన కనులు నీవు తెరవాలీ వివేచనా వెలుగులోకి రావాలీ నీకు నీ వాళ్లకు రక్షణ వచ్చును
నీ పిల్లలపై కృపా క్షేమముoడును నీ బ్రతుకు విలువైనదగును నీ జీవితం పరిశుద్ధమగును నేస్తమా ప్రియ నేస్తమా

కోరస్)
తెలుసుకో సత్యం మార్చుకొని జీవితం సమయం ఇంకా లేదు బ్రతుకంతా వ్యర్థం (2)

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)

సమయమిదే నీకు తరుణమిదే సమయం ఇదే నీకు తరుణమిదే..

3) ఆస్తిపాస్తులేవీ నీ వెంట రావు నీ పేరు ప్రతిష్టలూ అన్నీ వ్యర్థం దేవుని వాక్యం నీలో నిలుపుకో కడవరకూ నమ్మకంగ ఉండిపో శ్రమల యందు నిన్నూ నడిపించును సొమ్మసిల్లినా బలమునిచ్చును సజీవులకూ దేవుడాయనే మరణము నుండీ జీవమూ పొందుము నేస్తమా ప్రియనేస్తమా

కోరస్)
తెలుసుకో సత్యం మార్చుకొని జీవితం సమయం ఇంకా లేదు బ్రతుకంతా వ్యర్థం (2)

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)

సమయమిదే నీకు తరుణమిదే సమయం ఇదే నీకు తరుణమిదే..జీవితమంతా వ్యర్థంగా బ్రతికి తనువు చాలించాక నువ్వు తీసుకువెళ్లేదేది ప్రాణమున్నప్పుడే ప్రభు యేసునీ నమ్మి నీవు రక్షణ పొందాలి

(కోరస్)
తెలుసుకో సత్యం మార్చుకొని జీవితం సమయం ఇంకా లేదు బ్రతుకంతా వ్యర్థం (2)

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (4)
నీ ప్రేమ కనికరం నాపై చూపే యేసయ్య (2) నా ప్రియుడా నా యేసయ్యా నీ కృప ఏ చాలునయ్యా (2)
మంచి కాపరి నా మంచి కాపరి (2)
నీ ప్రేమ కనికరం నాపై చూపే యేసయ్య (2)

1) స్నేహితులూ చుట్టాలు విడచినా నన్ను విడువనీ
నీ కృపా సోదరులు తల్లిదండ్రులు మరచినా నన్ను మరువనీ నీ కృపా
నా కష్టకాలములో నా దుఃఖ సమయానా
నా చేయి విడువకా ఎడబాయని నీ.. కృపా
నా చేయి విడువక ఎడబాయని నీ కృపా

(కోరస్)
మంచి కాపరి నా మంచి కాపరి (2)
నీ ప్రేమ కనికరం నాపై చూపే యేసయ్యా

1) నిస్సహాయ స్థితిలో బలపరిచిన నీ కృపా హిమము కంటి తెల్లగా మార్చే నీ.. కృప నీ సాక్షిగా నేను జీవింతునయ్యా
(ఉన్నతమైనా స్థితినిచ్చినదీ
నీ కృపా (2)

(కోరస్)
మంచి కాపరి నా మంచి కాపరి (2)
నీ ప్రేమ కనికరం నాపై చూపే యేసయ్య (2)

2) నీ రెక్కల క్రింద నను దాచినా నీ.. కృపా నీ చిత్తమునూ ఎరిగినట్లుగా నన్ను మలచినా నీ కృపా నిన్ను వెదకుట నేర్పించి పరిశుద్ధతతో నింపీ
(భయ భక్తులు కలిగించి స్థిరపరిచినా నీ.. కృపా (2)

(కోరస్)
మంచి కాపరి నా మంచి కాపరి (2)
నీ ప్రేమ కనికరం నాపై చూపే యేసయ్య (2) నా ప్రియుడా నా యేసయ్యా నీ కృప ఏ చాలునయ్యా (2)

(కోరస్)
మంచి కాపరి నా మంచి కాపరి (2)
నీ ప్రేమ కనికరం నాపై చూపే యేసయ్య (2)
ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో (2) ప్రభు యేసును గూర్చి గానం చేసేదం కీర్తిని చాటిదం సువార్తను ప్రకటించెదం సువార్తను ప్రకటించెదం

(కోరస్)
నిజ దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే స్తుతించి పాడెదం
హల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)

ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో (2)

1) సితారతోను నాట్యాలతోనూ తాళాలతోనూ చప్పట్లతోనూ తీయని స్వరాలతో సంగీత ధ్వనులతో
ఘనపరచి ఆయనను కొనియాడెదం
స్తుతులతోనూ స్తోత్రాలతో విరిగి నలిగిన హృదయాలతో ఆరాధనతో ఆర్భాటముతో ఘనపరచి ఆయనను కొనియాడదాం
(కోరస్)
నిజ దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే స్తుతించి పాడెదం

హల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)

ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో (2)

2) పది తంతులా వాయిద్యాలతోనూ పిల్లన గ్రోవుల గానాలతోనూ
తంబుర శృతి తో ఉజ్జీవముతో
ఘనపరచి ఆయనను కొనియాడదం
సత్య వాక్య ధ్యానాలతో సర్వోన్నతునీ కీర్తనలతో పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఘనపరచి ఆయనను కొనియాడెదన్
(కోరస్)
నిజ దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే స్తుతించి పాడెదం

హల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2)

ఉత్సాహంతో సంతోషంతో ఆనందంతో (2)ప్రభు యేసును గూర్చి గానం చేసేదం కీర్తిని చాటిదం సువార్తను ప్రకటించడం సువార్తను ప్రకటించడం
(కోరస్)
నిజ దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే స్తుతించి పాడెదం

హల్లేలూయా హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (4)
ప్రభువా నిన్నే తలచి తలచి కొలిచెదనయ్యా నా రాజు నీవే యేసయ్యా వేదకి వెంబడించీ పట్టుకొని రక్షించావు (2)

శ్వాస నీవే సర్వం నీవే కొండా నీవే నా అండ నీవే

ప్రభువా నిన్నే తలచి తలచి కొలిచెదనయ్యా

1) లోయలలో లోతులలో అడవులలో… ఎడారులలో నా చేయి పట్టుకొని నీ కృపలో నడిపించి నలిగినా బ్రతుకునకు దిక్కువు నీవే
(నీ కార్యములూ చాటిచెప్పెదను నీతి సూర్యుడా మా యేసయ్య (2)

ప్రభువా నిన్నే తలచి తలచి కొలిచెదనయ్యా నా రాజు నీవే యేసయ్యా
(వేదకి వెంబడించీ పట్టుకొని రక్షించావు (2)

2) నా శోక సమయాన కృంగిన వేళ నన్ను దర్శించీ మాట్లాడితివీ
నిరాశా నిస్పృహాయందు వాక్యముతో నన్ను బలపరచితివీ
నమ్మిన వారే విడిచిపోయినా చేయందించీ ప్రేమించితివీ (నిత్యజీవమా నా బలమా నీకేమి చెల్లింతును నా యేసయ్య (2)

ప్రభువా నిన్నే తలచి తలచి కొలిచెదనయ్యా నా రాజు నీవే యేసయ్యా పదికి వెంబడించి పట్టుకొని రక్షించావు (2)

శ్వాస నీవే సర్వం నీవే కొండా నీవే నా అండ నీవే

ప్రభువా నిన్నే తలచి తలచి కొలిచెదనయ్యా
సంతోషం నాలో పొంగుచున్నదీ హల్లెలూయ స్తుతి పాటలే పాడనా ఆనందం నాలో కలుగుచున్నదీ
ఆరాధన పాటలే పాడనా

(కొనియాడి కీర్తించి పాడెదనూ స్తుతికి పాత్రుడా నా యేసయ్య (2)

(హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ హల్లెలూయ ఆరాధన (2)

సంతోషం నాలో పొంగుచున్నదీ హల్లెలూయ స్తుతి పాటలే పాడనా ఆనందం నాలో కలుగుచున్నదీ
ఆరాధన పాటలే పాడనా

1) ఇది నా రక్షణ సమయం
నే పొందే ఈ ఆనందం
మారు మనసునిచ్చెను నీవే పరిశుద్ధతనిచ్చెను నీవే క్షమించి మార్చెను నీవే
నన్ను సిద్ధపరిచెను నీవే వాగ్దానపూర్ణుడ నీవే
నా నిత్యజీవము నీవే
నా రక్షణ శృంగమా నన్ను నడిపించుమా నా ప్రభువా
నా యేసయ్య నా నజరేయుడా నా నజరేయుడా

(హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ హల్లెలూయ ఆరాధన (2)

సంతోషం నాలో పొంగుచున్నదీ హల్లెలూయ స్తుతి పాటలే పాడనా ఆనందం నాలో కలుగుచున్నదీ
ఆరాధన పాటలే పాడనా

2) దోషమంత తొలగిపోయెనూ పాప విమోచన కలిగెనూ
చీకటంతా కాలిపోయెనూ రోగమంత వదిలిపోయెనూ దేవాలయమాయెను హృదయం
ఆత్మతో నింపబడితినీ ఆశ్చర్యం అద్భుతమే
క్రీస్తులో జన్మించితినీ
నా రక్షణ శృంగమా నను నడిపించు మా
నా ప్రభువా నా యేసయ్య నా నజరేయుడా నా నజరేయుడా

(హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ హల్లెలూయ ఆరాధన (2)

సంతోషం నాలో పొంగుచున్నదీ హల్లెలూయ స్తుతి పాటలే పాడనా ఆనందం నాలో కలుగుచున్నదీ
ఆరాధన పాటలే పాడనా

(కొనియాడి కీర్తించి పాడెదనూ స్తుతికి పాత్రుడా నా యేసయ్య (2)

(హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ హల్లెలూయ ఆరాధన (2)

సంతోషం నాలో పొంగుచున్నదీ హల్లెలూయ స్తుతి పాటలే పాడనా ఆనందం నాలో కలుగుచున్నదీ
ఆరాధన పాటలే పాడనా
రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా
మండుచూ వెలిగించుట నేర్పుమయా దేవా
నీ ఆత్మతో మమ్ము నింపుము దేవా..
మాలో చీకటినీ కాల్చుము దేవా..
సైన్యములకు అధిపతీ
మా తండ్రీ మము వెలిగించే వెలుగు జ్యోతివి నీవే..

హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ హలేలుయ ఆమెన్ హల్లెలూయా..

రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా
మండుచూ వెలిగించుట నేర్పుమయా దేవా

1) సంపూర్ణమైనా విశ్వాస జీవితం.. పరిపూర్ణత మాలో నింపుము దేవా..
పరిశుద్ధత మారుమనస్సు ప్రతీ దినం
కలిగిన స్థిర బుద్ధిని
నొసగుము దేవా..
ఆకలైన మాలో జీవాహారం సత్య వాక్యాన్నే…. తినిపించుము బలపరచుము.. ఆత్మీయ స్థితిని స్థిరపరచుము.. నీతి సహవాసంలో

రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా
మండుచూ వెలిగించుట నేర్పుమయా దేవా
నీ ఆత్మతో మమ్ము నింపుము దేవా..
మాలో చీకటినీ కాల్చుము దేవా..

2) ఆత్మలో అగ్నీ అభిషేకం నిండుగా దిగనిమ్ము మాపై దేవా
జీవజలముల దప్పిక నిమ్ము ఆత్మ దాహాన్ని తీర్చును దేవా లోకయాత్రలో మా రథసారథి అధికం కానిమ్ము పరమందు ఫలములూ
ఇలలో మాకు స్వాస్థ్యము నీవే..
నిత్య జీవమా మము కరుణింపుమూ.

రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా
మండుచూ వెలిగించుట నేర్పుమయా దేవా
నీ ఆత్మతో మమ్ము నింపుము దేవా..
మాలో చీకటినీ కాల్చుము దేవా..

3)ఇరుకు మార్గములో వెలుచుండగా నిండైన నీ కృప తోడుంచుము దేవా.. నూతనా ఎరుషలేము చేరేవరకూ సిద్ధపాటు బుద్దిని కలిగించుము దేవా..
ఓర్పూ సహనం మాలో నింపుము దేవా..
మంచి పోరాటం పోరాడుట నేర్పుము
మా పరుగునూ కడ ముట్టించుమూ
నరక వేదన నుండి మమ్ము తప్పించుమూ

రగులుచున్న అగ్నితో నింపుమూ దేవా
మండుచూ వెలిగించుట నేర్పుమయా దేవా
నీ ఆత్మతో మమ్ము నింపుము దేవా..
మాలో చీకటినీ కాల్చుము దేవా..
సైన్యములకు అధిపతీ
మా తండ్రీ మము వెలిగించే వెలుగు జ్యోతివి నీవే..

(హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ హలేలుయ ఆమెన్ హల్లెలూయా…(2)
నజరేయుడా నా యేసయ్యా పదివేలలో పోల్చదగిన వాడా(2)
సత్యముగల రాజా జీవ మార్గమని (2) గళమెత్తి చాటేదనూ యేసయ్య గళ్ళమెత్తి చాటేదనూ మెస్సయ్య

నజరేయుడా నా యేసయ్యా పదివేలలో పోల్చదగిన వాడా

1)అంధకార స్థితిలో నుండీ.. లేవనెత్తు వాడవు నీవే.. చితికినా బ్రతుకులో.. వెలుగైన వాడవు నీవే..
నిన్న నేడు నిరంతరం ఒక్క రీతి యైన దేవుడు నీవే
తల్లి కన్నా తండ్రి కన్నా మిన్నగ ప్రేమించే దేవుడు నీవే..
మహిమ ఘనత నీకే చెల్లును ఆమెన్ హల్లెలూయ (2)

హా హల్లెలూయ హల్లెలూయ స్తుతి స్తోత్రం హల్లెలూయ స్తుతి స్తోత్రం హల్లెలూయ

నజరేయుడా నా యేసయ్యా పదివేలలో పోల్చదగిన వాడా(2)
సత్యముగల రాజా జీవ మార్గమని (2) గళమెత్తి చాటేదనూ యేసయ్య గళ్ళమెత్తి చాటేదనూ మెస్సయ్య

2) మరణ చాయల్లో వెలుగై
నీ ప్రేమ నన్ను తాకెనూ నీ కృప నాపై ఉన్నదీ లేకుంటే ఏమవుదునో
నూతన వస్త్రము నాకిచ్చీ మహిమతో నింపిన దేవా
నీకిష్టమైనా పాత్రగా నన్ను వాడుకొనుము జీవితమంతా.
మహిమ ఘనత నీకే చెల్లును ఆమెన్ హల్లెలూయ (2)

హా హల్లెలూయ హల్లెలూయ స్తుతి స్తోత్రం హల్లెలూయ స్తుతి స్తోత్రం హల్లెలూయ

నజరేయుడా నా యేసయ్యా పదివేలలో పోల్చదగిన వాడా(2)
సత్యముగల రాజా జీవ మార్గమని (2) గళమెత్తి చాటేదనూ యేసయ్య గళ్ళమెత్తి చాటేదనూ మెస్సయ్య

నజరేయుడా నా యేసయ్యా పదివేలలో పోల్చదగిన వాడా
మధురమైన ప్రేమ చిత్రమైన ప్రేమ వింతైన ప్రేమ యేసు నీ ప్రేమ నిత్యమైన ప్రేమ అద్భుతమైన ప్రేమ నన్ను మార్చిన ప్రేమా కల్వరి ప్రేమ
నెమ్మదినిచ్చే ప్రేమ నన్ను ఆదరించెనూ రక్షణ నిచ్చే ప్రేమ నాకై ప్రాణమిచ్చెనూ మారని ప్రేమా వీడని ప్రేమా ఎడబాయని ప్రేమా..

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ (2)

మధురమైన ప్రేమ చిత్రమైన ప్రేమ వింతైన ప్రేమ యేసు నీ ప్రేమా..

1) నాకై రక్తం కార్చీ నన్ను కొన్న ప్రేమ నాకై ప్రాణము నిచ్చి క్షమించే ప్రేమా
నేను పుట్టకమునుపే ఏర్పరచుకున్న ప్రేమ
నేను ఎరుగకమునుపే నన్ను ఎన్నుకున్న ప్రేమ
నేను తప్పిపోయిన పట్టుకున్న ప్రేమా
నేను చెదిరిపోయినా చెక్కుకున్న ప్రేమా

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ (2)

మధురమైన ప్రేమ చిత్రమైన ప్రేమ వింతైన ప్రేమ యేసు నీ ప్రేమ

స్తోత్రం స్తుతీ స్తోత్రం (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ

2) నా కన్నీరు అంతా తుడిచి ఓదార్చే ప్రేమ నా స్థితిని మార్చి రక్షించిన ప్రేమ వాక్యముతో దర్శించి బలపరిచే ప్రేమ
అనుదినం నేను ఆనందించే ప్రేమ
ఎల్లవేళల యందు క్షేమము కలిగించి నన్ను నడిపించి జయమునిచ్చే ప్రేమా

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ (2)

మధురమైన ప్రేమ చిత్రమైన ప్రేమ వింతైన ప్రేమ యేసు నీ ప్రేమ
నిత్యమైన ప్రేమ అద్భుతమైన ప్రేమ నన్ను మార్చిన ప్రేమ కల్వరి ప్రేమా
నెమ్మదినిచ్చే ప్రేమ నన్ను ఆదరించెనూ
రక్షణ నిచ్చే ప్రేమ నాకై ప్రాణమిచ్చెనూ
మారని ప్రేమ వీడని ప్రేమ ఎడబాయని ప్రేమా

హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ (4)
ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో ఆధారం ఆదరనా నీవేనయ్యా(2)
స్తోత్రము స్తుతి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా(2)
పరమ తండ్రీ యేసయ్య పరిశుద్ధుడ మా యేసయ్య

ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)

ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో….

2) అనుదినం స్తోత్ర గానాలతో.. స్తుతి పాత్రుడా ఆరాధనా ఆరాధనా (2)
పూజ్యనీయుడా నీకే స్తోత్రం పూజార్హుడా నీకే మహిమ శక్తిమంతుడా నీకే స్తోత్రం మహనీయుడా మా యేసయ్యా..
పరమ తండ్రి యేసయ్య పరిశుద్ధుడా మా యేసయ్య ..

ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)

ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో….

2) నిండు మనసుతో నిండు ఆత్మతో ఆరాధన మా రక్షకుడా ఆరాధన ఆరాధన(2)
మా ప్రియుడా నీకే స్తోత్రం జ్యోతీర్మయుడా నీకే మహిమ నీతి సూర్యుడా నీకే స్తోత్రం సర్వాధికారీ మా యేసయ్య
పరమ తండ్రి యేసయ్య పరిశుద్ధుడా మా యేసయ్య ..

ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)

ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో….

3) అత్యున్నతమైన సింహాసనముపై
ఆసీనుడా ఆరాధన ఆరాధన
మృత్యుంజయుడా నీకే స్తోత్రం తేజోమయుడా నీకే మహిమ
శ్రీమంతుడా నీకే స్తోత్రం మహా గనుడా మా యేసయ్యా
పరమ తండ్రి యేసయ్య పరిశుద్ధుడా మా యేసయ్య ..

ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)

ఆనందం ఆనందం సంతోషం నీ సన్నిధిలో ఆధారం ఆదరనా నీవేనయ్యా(2)
స్తోత్రము స్తుతి స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా(2)
పరమ తండ్రీ యేసయ్య పరిశుద్ధుడ మా యేసయ్య

ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
సాటి లేరయ్యా నీకెవ్వరు ఈ జగమంతటా
నీతో ఎవరయ్యా సమానులు విశ్వమంతటా (2)
మము ప్రేమించేవాడా. మము క్షమించేవాడా
(మాకై రక్తం కార్చేవాడా మాకై ప్రాణమిచ్చేవాడా (2)
పరిపూర్ణుడా మా పరిశుద్ధుడా (2)
మా పాప పరిహారార్థమై సిలువలో బలి అయిన దేవా

సాటి లేరయ్యా నీకెవ్వరు ఈ జగమంతటా
నీతో ఎవరయ్యా సమానులు

(1) లోక సంపదలూ నీతో సరితూగవూ వెండీ బంగారం నీకు సాటి రాదయ్య నీకు సాటి రాదయ్య
ఆకాశమే నీది సింహాసనం పుడమీ అంతా నీ పాదపీఠమయ్యా నీ పాదపీఠమయ్యా
నీవే.. ఇహమందు రక్షణ కర్తవూ.. నీవే.. జీవ మార్గం ఏసయ్య.. మము ఎన్నటికీ చేయి విడువవూ.. మా కాపరి నీవే యేసయ్యా..

పరిపూర్ణుడా మా పరిశుద్ధుడా (2)
మా పాప పరిహారార్థమై సిలువలో బలి అయిన దేవా

సాటి లేరయ్యా నీకెవ్వరు ఈ జగమంతటా
నీతో ఎవరయ్యా సమానులు

(2) నూతన జీవితం మాలో నింపుము నూతన సృష్టిగా మము మార్చుమయా.. మము మార్చు మాయా..
విశ్వాస జీవితం మాలో బలపరచుము మము నడిపించుమూ కడవరకు యేసయా కడవరకు యేసయా
వెలిగించుమూ పరిశుద్ధతలో మము నింపుము దేవా
నీ ఆత్మతో.. మము ఎన్నటికీ.. ఎడబాయవూ..
మా రక్షణ నీవే యేసయ్యా…

పరిపూర్ణుడా మా పరిశుద్ధుడా (2)
మా పాప పరిహారార్థమై సిలువలో బలియైన దేవా..
సాటి లేరయ్యా నీకెవ్వరు ఈ జగమంతటా
నీతో ఎవరయ్యా సమానులు విశ్వమంతటా (2)
మము ప్రేమించేవాడా. మము క్షమించేవాడా
(మాకై రక్తం కార్చేవాడా మాకై ప్రాణమిచ్చేవాడా (2)
పరిపూర్ణుడా మా పరిశుద్ధుడా (2)
మా పాప పరిహారార్థమై సిలువలో బలి అయిన దేవా

సాటి లేరయ్యా నీకెవ్వరు ఈ జగమంతటా
నీతో ఎవరయ్యా సమానులు విశ్వమంతటా …

YouTube Video:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *